వేమన పద్యాలు తెలుగు ప్రజల నాలుకపై తరతరాలుగా నిలిచిన నీతి పద్యాలు. ప్రతి పద్యం చివర వచ్చే ‘విశ్వదాభిరామ వినుర వేమ’ అనే మకుటం వీటికి గుర్తు.
పద్యం
ఉప్పు కప్పురంబు నొక్కపోలికనుండు
చూడ చూడ రుచుల జాడ వేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ వినుర వేమ
భావం
ఉప్పు, కర్పూరం చూడటానికి ఒకేలా కనిపించినా రుచిలో చాలా తేడా ఉంటుంది. అలాగే మనుషులందరూ ఒకేలా కనిపించినా, వారిలో పుణ్యాత్ములు వేరుగా ఉంటారు.