సుమతీ శతకం తెలుగులో అత్యంత ప్రసిద్ధి చెందిన నీతి శతకాలలో ఒకటి. చిన్న కంద పద్యాలలో ఆచరణీయమైన లోకజ్ఞానాన్ని అందిస్తుంది.

పద్యం

అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదా
నెక్కిన బారని గుర్రము
గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ

భావం

అవసరానికి ఉపయోగపడని బంధువును, మొక్కినా వరమివ్వని దైవాన్ని, యుద్ధరంగంలో ఎక్కినప్పుడు ముందుకు పరుగెత్తని గుర్రాన్ని వెంటనే విడిచిపెట్టాలి.